దేవరగట్టులో ప్రారంభమైన కర్రల సమరం
ఆంధ్ర ప్రదేశ్ : కర్నూలు(D) హొళగుంద(M) దేవరగట్టులో కర్రల సమరం ప్రారంభమైంది. దసరా సందర్భంగా బన్ని ఉత్సవంలో భాగంగా మాళమ్మ మల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులను ఊరేగిస్తున్నారు. వాటిని దక్కించుకోవడానికి 3 గ్రామాల భక్తులు ఒకవైపు, 7 గ్రామాల భక్తులు మరోవైపు కర్రలతో తలపడుతున్నారు. ఈ సమరాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. ఉత్సవంలో హింస చెలరేగకుండా 800మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.
Comments