దేశం, ధర్మం ,సంస్కృతి ,కోసం పనిచేయాలి
ఈరోజు మండల కేంద్రంలో RSS చిట్యాల ఖండ ఆధ్వర్యంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా స్వయం సేవకులు పద సంచలనం రూట్ మార్చ్ నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కార్యవాహ బుర్ర సదయ్య మాట్లాడుతూ..దేశం కోసం ధర్మం కోసం మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు పైన ఉన్నదని ఆనాడు 1925 దసరా రోజున డాక్టర్ బలిరాం హెడ్గేవర్ దేశంలో ఐక్యత కోసం వ్యక్తి నిర్మాణం కోసం స్థాపించబడిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఈ రోజున ప్రపంచంలోనే ఒక సేవ హిందువులంతాఐ కమత్యంగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నదని మన దేశం ఇప్పుడు ప్రపంచంలోనే 4వ ఆర్థిక వ్యవస్థగా ఏర్పడిందని ప్రపంచ దేశంలోనే హిందూ దేశంగా భారతదేశంగా ఉన్నదని కొన్ని దేశాలు కావాల్సు కొని మన దేశంలో అల్లర్లు,కులాల పేరుతోనే చిచ్చు పెట్టాలనే చూస్తున్నారని కావున ఇంటి లోపలే మన కులమని గడప దాటితే మనమంతా హిందువులం అని హిందువుగా జీవించు హిందువుగా గర్వించు అనే ఆనాడు స్వామి వివేకానంద మన దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారని అప్పటినుండి ఇప్పటివరకు కూడా దేశం ఐకమత్యంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉన్నదని ప్రతి ఒక్కరూ దేశభక్తిని అలవర్చుకోవాలని ఆయన అన్నారు .
ఈ కార్యక్రమంలో చిట్యాల ఖండ సంఘ చాల క్ కనుల లక్ష్మారెడ్డి ఖండ కార్యవాహ కోడూరి రాజు మరియు 300 మంది స్వయం సేవకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments