దసరా.. రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు
తెలంగాణ : దసరాకు ఈసారి మద్యం అమ్మకాలు భారీగా జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. నిన్న గాంధీ జయంతి కావడంతో షాపులు మూసివేయగా సెప్టెంబర్ 30, అక్టోబర్ 1న మొత్తం రూ.419 కోట్ల అమ్మకాలు జరిగాయన్నారు. ఇందులో సెప్టెంబర్ 30నే రూ.333 కోట్ల మద్యం అమ్ముడుపోయినట్లు పేర్కొన్నారు. ఈ నెల 1న రూ.86 కోట్ల సేల్స్ జరిగాయని వెల్లడించారు. సాధారణంతో పోలిస్తే సెప్టెంబర్ 26 నుంచి అమ్మకాలు రెట్టింపయ్యాయని వెల్లడించారు.
Comments