దసరా సెలవులు పొడిగించాలని డిమాండ్!
తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలకు దసరా సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ లో ఈనెల 22-అక్టోబర్ 2 వరకు సెలవులిచ్చి, 3న రీఓపెన్ చేస్తామని పేర్కొన్నాయి. అయితే, పండుగ 2వ తేదీనే ఉందని.. సొంతూళ్లు, బంధువుల ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు మరుసటిరోజే ఎలా వస్తారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. 4వ తేదీ వరకైనా హాలిడేస్ పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణలో స్కూళ్లకు ఈనెల 21- అక్టోబర్ 3 వరకు సెలవులిచ్చారు.
Comments