• Oct 27, 2026
  • NPN Log

    టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్  దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మైదానంలో ధోని తీసుకునే నిర్ణయాలు, ఆటను అర్థం చేసుకునే విధానం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపాడు. ధోనికి ఉన్న ప్రత్యేక లక్షణాన్ని తన కెప్టెన్సీలోనూ అనుసరించాలని అనుకుంటున్నట్లు వెల్లడించాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ధోని నాయకత్వంలో ఆడిన అనుభవాలను ఫాఫ్ తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నాడు.

    ‘ధోనికి మైదానంలో ఆటను అర్థం చేసుకునే అద్భుతమైన సామర్థ్యం ఉంది. అతడు మ్యాచ్‌కు ముందే మరీ ఎక్కువగా ప్రణాళికలు వేసుకోవడానికి ఇష్టపడడు. ఆట జరుగుతున్న సమయంలో తన సహజమైన ఆలోచనలతో నిర్ణయాలు తీసుకుంటాడు. అదే అతడి సూపర్‌పవర్‌. మైదానంలో పరిస్థితులను, ఆటగాళ్లను నిశితంగా గమనిస్తూ చాలా ప్రశాంతంగా ఉంటాడు. ధోని ఎంత సంయమనంతో వ్యవహరిస్తాడో అందరికీ తెలిసిందే. ఆ లక్షణాన్ని నేను కూడా అతడి నుంచి నేర్చుకుని నా కెప్టెన్సీలో అనుసరించాలనుకుంటున్నా’ అని ఫాఫ్ వెల్లడించాడు. ఫాఫ్ డుప్లెసిస్ ఐపీఎల్‌లో మొత్తం 154 మ్యాచ్‌లు ఆడి 4,773 పరుగులు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో తొమ్మిది సీజన్ల పాటు కొనసాగిన అతడు.. ధోని నాయకత్వంలో మూడు ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టులోకి మారాడు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement