ధవళేశ్వరం వద్ద గోదావరి ఉద్ధృతి
ఆంధ్ర ప్రదేశ్ : ఎగువన కురుస్తున్న వర్షాలు, ఉపనదుల నుంచి వరద రాకతో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం వద్ద నీటిమట్టం 13.60 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీ నుంచి 12.61 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గోదావరి ఉగ్రరూపంతో ఉభయ గోదావరి జిల్లాల్లోని లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
Comments