నంద్యాల జిల్లాలో హైకోర్టు న్యాయమూర్తుల పర్యటన
నంద్యాల : రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు శనివారం నంద్యాల జిల్లాలో పర్యటించారు. నందికొట్కూరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అదనపు సివిల్ కోర్టును హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణమోహన్, జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి, జస్టిస్ హరిహరనాథ్ శర్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ప్రధాన న్యాయాధికారి కబర్ధి తదితరులు పాల్గొన్నారు. కాగా.. ఆదివారం నంద్యాల, కర్నూలు పట్టణంలో పలు కోర్టులను హైకోర్టు న్యాయమూర్తులు ప్రారంభించనున్నారు.










Comments