• Mar 02, 2026
  • NPN Log
    నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి జిల్లా కార్మిక శాఖ అధికారికి సమస్యలపై వినతి పత్రం కొత్తగూడెం భువన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఏఐటియుసి ఏఐసిబిసిడబ్ల్యూ దేశవ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా కార్మిక శాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు వేల్పుల మల్లికార్జున్ మాట్లాడుతూ నిర్మాణ రంగానికి ప్రభుత్వం విధిస్తున్న సెస్సును ఒక శాతం నుండి రెండు శాతానికి పెంచాలని ఇన్సూరెన్స్లను ప్రైవేటుపరం చేసే ఆలోచన ప్రభుత్వం విరమించుకోవాలని సహజ మరణానికి ఇన్సూరెన్స్ రెండు లక్షల నుండి 5 లక్షలకు పెంచాలని వివాహ కానుక 30 వేల నుండి ఒక లక్షకు పెంచాలని ప్రసూతి సహాయం 30 వేల నుండి ఒక లక్షకు పెంచాలని కార్మిక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి లో కార్మిక సంఘాల ప్రతినిధులతో పాలకమండలి నియమించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోరి కృష్ణారావు పెనుబుద్ధి పున్నారావు అనుముల సాయి తదితరులు పాల్గొన్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement