• Mar 02, 2026
  • NPN Log
    • విశాఖపట్నం (గాజువాక)
    •  



              జీవీఎంసీలో పనిచేస్తున్న అన్ని వెహికల్ డ్రైవర్లు (పర్మినెంట్, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్) సోమవారం నుండి సమ్మెకు సిద్ధమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకు వస్తున్నాము.


               జీవీఎంసీకి సంబంధించిన వాహనాల ఇన్సూరెన్స్,ఫిట్నెస్ సర్టిఫికేట్లు గడువు ముగిసినవి, సర్వీస్ చేయని వాహనాలు వంటి అనేక ముఖ్యమైన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి పలు మార్లు తీసుకువచ్చినప్పటికీ, ఎటువంటి స్పందన లేకపోవడం చాలా విచారకరం.
     

    •                  తేదీ 27-02-2026 న గాజువాక జోన్‌కు చెందిన పబ్లిక్ హెల్త్ టిప్పర్ వాహనం ప్రమాదానికి గురై ఒక వ్యక్తి మరణించడం జరిగింది. ఈ సందర్భంలో ఔట్‌సోర్సింగ్ డ్రైవర్ జరిగిన విషయం వివరించి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అయితే, ఏమాత్రం జీవీఎంసీ వాహనాల పని పట్ల అవగాహన లేని  ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి   ఇప్పుడు  జీవీఎంసీ వెహికల్ ఇన్‌చార్జ్ అనే హోదాతో  పనిచేస్తున్న శ్రీ సాయిబాబా,డి.ఇ.సునీల్,ఏ.ఇ. మేడం అక్కడికి వచ్చి సంఘటనపై సరైన సమాచారం తెలుసుకోకుండా,అందరి ముందూ డ్రైవర్‌పై అనుచితమైన పదజాలంతో దుర్భాషలాడి,అతడిని మానసికంగా ఇబ్బందులకు గురిచేశారు.
       
    •         డ్రైవర్‌కు మాకు సంబంధం లేదని, మేము వాహనం కోసమే వచ్చామని పోలీస్ అధికారులకు తెలియజేసి, వాహనాన్ని మాత్రమే విడిపించేందుకు ప్రయత్నించడం చాలా బాధాకరం. డ్రైవర్ పట్ల పూర్తిగా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించబడింది.
       
    •         కార్మికుల ప్రయోజనాలను కాపాడవలసిన అధికారులు ఈ విధంగా వ్యవహరించడం సరైనది కాదు. గత కొంతకాలంగా డ్రైవర్ల పట్ల దుర్వ్యవహారం, దుర్భాషలాడటం, మానసికంగా వేధించడం వంటి సమస్యలు పెరుగుతున్నాయి.

    •                       కాబట్టి, పై సమస్యలన్నింటిని మీరు అత్యవసరంగా పరిశీలించి:

    •                    తరచూ అకారణంగా డ్రైవర్లను వేధిస్తూ  మానసిక  క్షోభ గురిచేస్తున్న సాయిబాబా ఇతర అధికారులపై చర్యలు తీసుకోవాలి.
                                                 వెహికల్ ఇన్చార్జిగా సాయిబాబా నిర్వహించిన విధుల,నిధులు వినియోగం పై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలి.
       
    •           గాజువాక జోన్ లో జరిగిన సంఘటనలో డ్రైవర్ సతీష్ పై వ్రాయలేని పదాలను ద్వేషించడం.తన వల్లే ప్రమాదం జరిగిందని ఒప్పుకోమని డ్రైవర్ పై ఒత్తిడి చేస్తున్న సాయిబాబా,D.E సునీల్, ఏఈ లు ను విధులను తొలగించాలి.

     

           వాహనాల ఇన్సూరెన్స్,ఫిట్నెస్ సమస్యలు పరిష్కరించాలి..ప్రమాదాలు ఇతర సమస్యలు పరిష్కార నిమిత్తం వెంటనే గతంలో మాదిరిగా లీగల్ సెల్ ఏర్పాటు చేయాలి.
     

            డ్రైవర్లకు రక్షణ కల్పించాలి….


        హెవీ వెహికల్స్ కు హెల్ప్ ర్ ని ఏర్పాటు చేయాలి.తరచూ డ్రైవర్లపై దురుసుగా ప్రవర్తిస్తూ మానసిక శోభ పెడుతున్న మానసిక శోభ జీవీఎంసీ కి సంబంధం లేని  సాయిబాబా చేసిన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలి,లేకపోతే, అధికారుల వైఖరికి నిరసనగా సోమవారం నుండి జీవీఎంసీ డ్రైవర్లు వాహనాల బంద్ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
    కాబట్టి,దయచేసి తక్షణమే జోక్యం చేసుకొని సమస్యలను పరిష్కరించవలసిందిగా మనవి.
     

             జీవీఎంసీ లో డ్రైవర్ పై జరుగుతున్న వేధింపులు నిరసనగా  సమంత అధికారులు చర్యలు తీసుకోమని కమిషనర్ గారికి మేయర్ గారికి ఇతర అధికారులకు తేదీ 28న శనివార నాడు జీవీఎంసీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు పడాల రమణ ఇతర నాయకులు కార్మికులు కలిసివినతి పత్రాలు ద్వారా తెలియజేసినప్పటికీ జరిగిన సంఘటనపై ఎటువంటి విచారణ లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జీవీఎంసీ అధికారుల యొక్క తీరు మారాలని జీవీఎంసీ ఫర్ మెంట్ ఔట్సోర్సింగ్ కాంటాక్ట్ డ్రైవర్ సంస్థలు పరిష్కరించాలని కోరుతూ రేపు ఉదయం నుండి సమ్మెకు సిద్ధమవుతున్నామని తెలియజేయడమైనది.

             

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement