నా భార్యను తాళి వేసుకోవద్దనే చెప్తా: రాహుల్
రాహుల్ రవీంద్రన్ తన భార్య, గాయని చిన్మయి శ్రీపాద మంగళసూత్రం ధరించడంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇటీవల ‘గర్ల్ ఫ్రెండ్’ మూవీ ప్రమోషన్స్‌లో రాహుల్ మాట్లాడారు. ‘పెళ్లి తర్వాత మంగళసూత్రం ధరించాలా వద్దా అనేది పూర్తిగా నా భార్య చిన్మయి నిర్ణయం. నేను తాళి వేసుకోవద్దనే చెప్తా. ఎందుకంటే పెళ్లి తర్వాత అమ్మాయిలకు తాళి ఉన్నట్లు అబ్బాయిలకు ఎలాంటి ఆధారం లేదు. ఇది ఒక వివక్ష లాంటిదే’ అని చెప్పారు.









Comments