పాట చిత్రీకరణలో రవితేజ సినిమా
మాస్ మహరాజా రవితేజ 75వ చిత్రం ‘మాస్ జాతర’ ఇటీవలే జనం ముందుకు వచ్చింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో రూపుదిద్దుకున్న ఈ సినిమా అభిమానులను సైతం నిరాశ పర్చింది. 'మాస్ జాతర' పరాజయాన్ని పట్టించుకోకుండా రవితేజ మాత్రం తన 76వ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ హీరోగా ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఓ సినిమా నిర్మిస్తున్నారు. ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పాట చిత్రీకరణ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతోంది. ఈ డాన్స్ నంబర్ కోసం ఫ్లోర్ లో భారీ సెట్ ను వేశారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. మాస్ ఆడియెన్స్ ను అలరించేలా ఈ డాన్స్ నంబర్ ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్ ను బిగ్ కాన్వాస్ లో హోల్సమ్ ఎంటర్ టైనర్ గా కిశోర్ తిరుమల తెరకెక్కిస్తున్నారని సుధాకర్ చెరుకూరి తెలిపారు. రవితేజ 'మాస్ జాతర'కు సంగీతాన్ని సమకూర్చిన భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకూ మ్యూజిక్ అందిస్తున్నాడు.
ఎమోషనల్ కథాంశాలను తెరకెక్కించడంలో సిద్థహస్తుడైన కిశోర్ తిరుమల ఈ సినిమాను ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఎలక్ట్రిక్ ఎనర్జీతో ప్రేక్షకులను అలరించే రవితేజ ఇందులో న్యూ స్టైలిష్ లుక్ తో కనిపించబోతున్నారని సుధాకర్ చెరుకూరి చెబుతున్నారు. మరి గత కొన్నేళ్ళుగా సరైన సక్సెస్ లేక సతమతమౌతున్న రవితేజ ను ఈ సినిమా అయినా సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి.
 
                     
                              
  









 
 
Comments