పెరిగిన ధరలకు బ్రేక్..భారీగా తగ్గిన బంగారం, వెండి
నేడు బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే సెప్టెంబర్ 19, 2025న ఉదయం 6 గంటల సమయంలో గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములకు రూ.1,11,160కి చేరింది. ఇది నిన్నటి ధరలతో పోలిస్తే దాదాపు రూ.540 తగ్గినట్లు కనిపిస్తోంది.
22 క్యారెట్ పసిడి 10 గ్రాములకు రూ.1,01,890గా ఉంది. ఇక వెండి ధరల్లో మరింత ఆసక్తికరంగా మార్పు వచ్చింది. హైదరాబాద్, కేరళలో కేజీ వెండి రూ.4,000 తగ్గి రూ.1,40,900కి చేరింది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
దేశవ్యాప్తంగా బంగారం ధరలు
దేశంలో 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు చాలా నగరాల్లో రూ.1,11,160 నుంచి రూ.1,11,480 మధ్య ఉంది. హైదరాబాద్‌లో రూ.1,11,160, ముంబై, కేరళ, పూణే, కోల్‌కతాలో కూడా ఇదే ధర. ఢిల్లీలో రూ.1,11,310, చెన్నైలో రూ.1,11,480గా ఉంది. ఇక్కడ మార్కెట్ ప్రీమియం కొంచెం ఎక్కువగా ఉంది.
22 క్యారెట్ పసిడి విషయంలో హైదరాబాద్‌లో రూ.1,01,890, ముంబై, పూణే, కోల్‌కతా, కేరళలో కూడా ఇలాంటి ధరలే ఉన్నాయి. చెన్నైలో రూ.1,02,190గా కలదు. ఈ తగ్గుదల వెనుక అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ బలహీనత, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేటు నిర్ణయాలు సహా పలు అంశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
Comments