ప్రభాస్ లుక్ ఏఐనా.. రియల్ అనుకోని మురిసిపోయామే
ఇండస్ట్రీలో హీరోలు.. ఏ సినిమాకు తగ్గట్లు ఆ లుక్ ను మెయింటైన్ చేస్తూ ఉంటారు. క్యారెక్టర్ కు సూట్ అయ్యే విధంగా కొన్నిసార్లు బరువు తగ్గుతారు.. కొన్నిసార్లు బరువు పెరుగుతారు. ఇలా చేయడం వలన చాలామంది హీరోలు ట్రోల్స్ కు కూడా గురయ్యారు. అయితే గత కొంతకాలంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. లుక్ విషయంలో ట్రోల్స్ కు గురవుతూనే ఉన్నాడు. ముఖ్యంగా ఆదిపురుష్ సమయంలో డార్లింగ్ పై వచ్చినన్ని ట్రోల్స్ ఇంకే హీరోపై రాలేదు అంటే అతిశయోక్తి కాదు.
ఇక ఇలాంటి ట్రోల్స్ ను డార్లింగ్ ఎప్పుడు పట్టించుకోలేదు. కాకపోతే ఆయన మోకాలి సర్జరీ కోసం ఎప్పటికప్పుడు విదేశాలకు వెళ్లి వస్తుండడంతో ఒకవేళ ఆ అనారోగ్య సమస్యల వలన ప్రభాస్ బరువు పెరిగి ఉండొచ్చు అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇక డార్లింగ్ లుక్ అన్ని సినిమాల్లో ఒకలా ఉన్నా.. ది రాజాసాబ్ లో మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. వింటేజ్ ప్రభాస్ ను మారుతీ చూపించాడు. అయితే బయట కూడా ప్రభాస్ అలానే ఉన్నాడేమో అనుకున్నారు. మొన్నటికి మొన్న బాహుబలి రీయూనియన్ పార్టీలో డార్లింగ్ లుక్ చూసి ఇండస్ట్రీ షేక్ అయ్యిపోయింది.
బ్లాక్ షర్ట్ లో జా లైన్ కనిపించేలా.. ఏమున్నాడ్రా బాబు అనిపించాడు. ఇక ఈరోజు రిలీజ్ చేసిన బాహుబలి ది ఎపిక్ ప్రమోషన్ వీడియోలో కూడా డార్లింగ్ లుక్ చూసి ఇండస్ట్రీ షేక్ అయ్యింది. ఇదిరా డార్లింగ్ అంటే.. ఆ అందం అలాంటిది అంటూ సంబరాలు చేసుకున్నారు. అయితే ఆ ఆనందం ఎంతోసేపు నిలువలేదు. ఆ ఫోటోలు ప్రభాస్ ఒరిజినల్ ఫొటోస్ కాదు.. ఏఐ టెక్నాలజీ వాడి చేసినవని తెలుసుకొని షాక్ అయ్యారు.
స్పిరిట్ ఆడియోలో డార్లింగ్ వాయిస్ ఎలాగైతే ఏఐ ద్వారా చేశారో.. ఈ వీడియోను కూడా అలాగే ఎడిట్ చేసినట్లు సమాచారం. ఇక అది నిజమని బాహుబలి ది ఎపిక్ స్పెషల్ ఇంటర్వ్యూ ప్రోమోలో రుజువయ్యింది . ఈ ప్రోమోలో ప్రభాస్ నార్మల్ లుక్ లోనే కనిపించాడు. దీంతో ఏఐ ఎడిటెడ్ ఫొటోస్, వీడియోస్ నిజమని అర్ధమయ్యింది. దీంతో ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ లుక్ ఏఐనా.. రియల్ అనుకోని మురిసిపోయామే అని కామెంట్స్ చేస్తున్నారు.










Comments