రొమాంటిక్ సీన్స్ చేసి ఉంటే సక్సెస్ అయ్యేదాన్ని: నటి ధన్య
కండీషన్లు పెట్టుకోవడం వల్లే తాను ఇండస్ట్రీలో పెద్ద స్థాయికి ఎదగలేకపోయానని నటి ధన్య బాలకృష్ణన్ అన్నారు. రొమాంటిక్ సీన్లు చేయొద్దనే కండీషన్ పెట్టుకోవడంతో చాలా సినిమాలు వదులుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఒకవేళ ఆ సీన్లు చేసి ఉంటే మంచి పొజీషన్‌లో ఉండేదాన్ని అని పేర్కొన్నారు. మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన తాను ఈ స్థాయికి చేరుకుంటానని ఊహించలేదన్నారు. ఆమె నటించిన ‘కృష్ణలీల’ నవంబర్ 7న రిలీజ్ కానుంది.








Comments