ప్రేమ పెళ్లి.. వారం రోజులకే నవ వధువు సూసైడ్
తెలంగాణ : జగిత్యాల(D) ఎర్దండిలో పెళ్లయిన వారం రోజులకే నవ వధువు సూసైడ్ చేసుకుంది. ఒకే గ్రామానికి చెందిన సంతోష్, గంగోత్రి(22) గత నెల 26న ప్రేమ పెళ్లి చేసుకున్నారు. దసరా రోజున తల్లి ఇంటికి వెళ్లగా భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. అనంతరం గంగోత్రిని సంతోష్ తన ఇంటికి తీసుకెళ్లాడు. అర్ధరాత్రి దాటాక ఆమె ఆత్మహత్య చేసుకుంది. గంగోత్రి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు.
Comments