ప్రిలిమ్స్ ముగిసిన వెంటనే ప్రొవిజినల్ ఆన్సర్ కీ: UPSC
సివిల్స్ ప్రిలిమ్స్ నిర్వహించిన వెంటనే ప్రొవిజినల్ ఆన్సర్ కీ విడుదల చేయనున్నట్లు UPSC పేర్కొంది. పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీం కోర్టుకు తెలిపింది. ప్రస్తుతం సివిల్స్‌లో తుది ఫలితాలు ప్రకటించే వరకు కీ ఇవ్వడం లేదు. దీనిపై కొందరు అభ్యర్థులు కోర్టులో పిటిషన్ వేశారు. కీ ఆలస్యం వల్ల పరీక్షల్లో పారదర్శకత లోపిస్తోందన్నారు. దీనిపై కమిషన్ అఫిడవిట్ దాఖలు చేయడంతో పాత విధానానికి తెరపడనుంది.
Comments