పిల్లలకు ఫోన్ చూపిస్తూ ఫుడ్ పెడుతున్నారా?
ప్రస్తుతం చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఫోన్స్‌ను చూపిస్తూ ఆహారం తినిపిస్తున్నారు. త్వరగా ఫుడ్ తింటారనే ‘స్క్రీన్ ఫీడింగ్’ చేయడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల పిల్లల్లో ఆలస్యంగా మాటలు రావడం, ఏకాగ్రత లోపించడం, తల్లిదండ్రులతో మానసిక అనుబంధం తగ్గడం వంటి తీవ్ర సమస్యలు వస్తున్నట్లు తెలిపారు. భోజన సమయంలో మొబైల్‌ను దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. మీరూ ఇలానే చేస్తున్నారా?
 
                     
                              
  









 
 
Comments