పాల ప్రొడక్టుల ధరలు తగ్గింపు
ఆంధ్రప్రదేశ్ : GST తగ్గడంతో తమ ఉత్పత్తులపై ధరలు తగ్గిస్తున్నట్లు సంగం, విజయ డెయిరీలు ప్రకటించాయి. సంగం డెయిరీ UHT పాలు లీటరుపై రూ.2, పనీర్ కిలో రూ.15, నెయ్యి-వెన్న కిలోకి రూ.30, బేకరి ప్రొడక్టులు కిలోపై రూ.20 మేర తగ్గించనుంది. విజయ డెయిరీ టెట్రాపాలు లీటరు రూ.5, ఫ్లేవర్డ్ మిల్క్ లీటరుకు రూ.5, పన్నీర్ కిలో రూ.20, వెన్న-నెయ్యిపై కిలోకి రూ.30 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమలులోకొస్తాయి.
Comments