బుక్ చేసిన 2-3 రోజుల్లో సిలిండర్ డెలివరీ: పౌరసరఫరాల శాఖ
ఆంధ్ర ప్రదేశ్ : రాష్ట్రంలోని రిఫైనరీల్లో ప్రస్తుతం 14వేల టన్నుల LPG నిల్వలు ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. ఆన్‌లైన్‌లో గ్యాస్ బుక్ చేస్తే 2-3 రోజుల్లో సిలిండర్ హోమ్ డెలివరీ చేస్తారని తెలిపింది. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత లేదని స్పష్టం చేసింది. వదంతులు నమ్మి ప్యానిక్ బుకింగ్‌లు చేయవద్దని, గ్యాస్ ఏజెన్సీలకు వెళ్లొద్దని కోరింది. గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామంది.








Comments