• Apr 19, 2026
  • NPN Log

    బెండకాయలను కోసేటప్పుడు, వండేటప్పుడు వాటిలోని జిగురు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ సమస్యను తొలగించే చిన్న చిట్కాలివే...

    బెండకాయలకు తడి తగిలితే వాటిలో జిగురు పెరుగుతుంది. కాబట్టి వండడానికి గంట ముందే వాటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. ఇంకా తడి ఉన్నట్లయితే పలుచని గుడ్డతో తుడిచి ఆపైన ముక్కలు కోయాలి.

    బెండకాయలను కోసేముందు చాకుకు రెండువైపులా కొద్దిగా నిమ్మరసం లేదా నూనెను రాస్తే జిగురు ఎక్కువగా రాదు. ముక్కలు కూడా ఒకదానికొకటి అంటుకోవు.

    బెండకాయలను వండేటప్పుడు అందులో కొద్దిగా పెరుగు లేదా చింతపండు రసం వేస్తే జిగురు రాకుండా ఉంటుంది. ముక్కలు విడివిడిగా ఉంటూ త్వరగా మగ్గుతాయి. కూరలో నిమ్మరసం చిలకరించినా కూడా మంచి ఫలితం కనిపిస్తుంది.

    బెండకాయలతో కూర లేదా వేపుడు చేసేటప్పుడు గిన్నెపై మూత పెట్టకూడదు. అలా పెడితే గిన్నెలో నీటి ఆవిరి ఏర్పడి ముక్కలను మెత్తగా జిగురుగా మార్చేస్తుంది. కాబట్టి మూత లేకుండా మధ్యస్థ మంటపై వండితే కూర లేదా వేపుడు త్వరగా తయారవుతుంది.

    బెండకాయలను వండేటప్పుడు ముందుగానే ఉప్పు వేయకూడదు. అలావేస్తే ముక్కల నుంచి నీరు విడుదలై కూర మొత్తం జిగురుగా తయారవుతుంది. ముక్కలు ముప్పావు వంతుకు పైగా మగ్గిన తరువాతనే అందులో ఉప్పు, కారం వేస్తే కూర పొడి పొడిగా ఉంటుంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement