బందీల విడుదలకు హమాస్ అంగీకారం
ఇజ్రాయెలీ బందీలు(మృతులు/బతికున్నవారు) అందరినీ రిలీజ్ చేసేందుకు హమాస్ అంగీకరించింది. ట్రంప్ ప్రతిపాదించిన పీస్ డీల్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. వెంటనే మధ్యవర్తుల ద్వారా ఈ ప్లాన్‌పై చర్చించాలని ప్రకటన రిలీజ్ చేసింది. అరబ్, ఇస్లామిక్ తదితర దేశాలు, ట్రంప్ ప్రయత్నాలను స్వాగతిస్తున్నామంది. అధికారం వదిలేందుకు సిద్ధంగా ఉన్నట్లు సిగ్నల్ ఇచ్చింది. దీంతో 2023 అక్టోబర్ లో మొదలైన వార్‌కు త్వరలో తెరపడే అవకాశముంది.
Comments