బాపూఘాట్లో ఘనంగా గాంధీ జయంతి
కార్వాన్ : జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలను లంగర్హౌజ్లోని బాపూఘాట్లో గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్రెడ్డి పాల్గొని గాంధీజీ సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సర్వమత ప్రార్థనల్లో గవర్నర్, సీఎం పాల్గొన్నారు. కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments