బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ ఒప్పుకుంది: ట్రంప్
గాజాలో తొలిదశ బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్‌లో పోస్ట్ చేశారు. ‘బలగాల ఉపసంహరణపై పంపిన ప్రణాళికకు హమాస్ అంగీకారం తెలిపితే సీజ్ ఫైర్ అమల్లోకి వస్తుంది. వెంటనే ఇజ్రాయెల్-హమాస్ మధ్య బందీలు, ఖైదీల అప్పగింత మొదలవుతుంది. ఆ తర్వాత బలగాల ఉపసంహరణకు నిబంధనలు సిద్ధం చేస్తాం’ అని పేర్కొన్నారు. అయితే బలగాల ఉపసంహరణపై ఇజ్రాయెల్ అధికారిక ప్రకటన చేయలేదు.
Comments