భారతీయుల్లో పెరుగుతున్న ‘స్లీప్ షేమింగ్’.. ఏంటిది?
తక్కువ నిద్రపోవడాన్ని గొప్పగా, ఎక్కువ పోతే సోమరితనంగా భావించే అలవాటు భారతీయుల్లో పెరిగిపోతోందని నిపుణులు అభిప్రాయపడ్డారు. దీన్నే ‘స్లీప్ షేమింగ్’ అంటారు. కష్టపడి పనిచేయడం అంటే నిద్రను త్యాగం చేయడమేనన్న తప్పుడు ఆలోచన వల్ల చాలామంది ఒత్తిడికి గురవుతున్నారన్నారు. అయితే సరిగ్గా నిద్రపోతేనే ఆరోగ్యం, పనిలో వేగం పెరుగుతాయని సూచిస్తున్నారు. తగినంత విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో అవసరమంటున్నారు.










Comments