భారీ జీతంతో ఆర్మీలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?
ఇంజినీరింగ్ పూర్తైన, చివరి సంవత్సరం చదువుతున్నవారు టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు(TGC)లో చేరేందుకు ఆర్మీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బీటెక్ మార్కుల మెరిట్‌తో ఎంపిక చేస్తారు. ఏడాది శిక్షణలో రూ.56,100 స్టైపెండ్ ఇస్తారు. ఆ తర్వాత మొదటి నెల నుంచే రూ.లక్ష వరకు శాలరీ ఉంటుంది. పెళ్లికాని 20-27ఏళ్ల మధ్య ఉన్న పురుషులు అర్హులు. మొత్తం ఖాళీలు 30. నవంబర్ 6వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనుంది.









Comments