ముగిసిన దసరా సెలవులు
ఆంధ్ర ప్రదేశ్ : రాష్ట్రంలో స్కూళ్లకు దసరా సెలవులు నిన్నటితో ముగిశాయి. ఇవాళ్టి నుంచి క్లాసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి వరుసగా 11 రోజుల పాటు హాలిడేస్ ఆస్వాదించిన విద్యార్థులు, టీచర్లు ఇక బడి బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. పండుగ కోసం ఊర్లకు వెళ్లినవారు ప్రభుత్వం సెలవులను ఒక్కరోజైనా పొడిగిస్తుందని ఆశగా ఎదురుచూశారు. నిన్న రాత్రి వరకు ఎలాంటి ప్రకటన రాకపోవడంతో నిరాశచెందారు.
Comments