మిథున్‌రెడ్డి న్యూయార్క్ పర్యటన పిటిషన్‌పై నేడు తీర్పు
విజయవాడ : న్యూయార్క్ పర్యటనకు వెళ్లడానికి అనుమతి కోరుతూ, సిట్ జారీ చేసిన లుక్ అవుట్ సర్కులర్ రద్దు చేయాలని అభ్యర్థిస్తూ రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ఏసీబీ కోర్టు శుక్రవారం వెలువరించనుంది. ఈ పిటిషన్‌పై గురువారం వాదనలు ముగిశాయి. మిథున్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది నాగార్జునరెడ్డి వాదనలు వినిపించారు. కోర్టు ద్వారా సిట్ నుంచి తీసుకున్న పాస్‌పోర్టును న్యూయార్క్ సమావేశానికి మాత్రమే మిఽథున్‌రెడ్డి ఉపయోగిస్తారని వివరించారు. అక్కడికి వెళ్లేందుకు వీలుగా లుక్ అవుట్ సర్కులర్‌ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రాసిక్యూషన్ తరపున జేడీ రాజేంద్రప్రసాద్ వాదనలు వినిపించారు. మద్యం కేసులో నిందితుడిగా ఉండి షరతుల ద్వారా బెయిల్ పొందిన మిథున్‌రెడ్డి న్యూయార్క్ ఎలా వెళ్తారని ప్రశ్నించారు. వాదనలు విన్న న్యాయాధికారి తీర్పును శుక్రవారానికి వాయిదా వేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
Comments