మిథున్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి: సిట్
ఆంధ్రప్రదేశ్ : వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ రద్దుచేయాలని హైకోర్టులో CID ఆధ్వర్యంలోని సిట్ పిటిషన్ దాఖలు చేసింది. ACB కోర్టు మంజూరు చేసిన బెయిల్లో చట్టపరమైన లోపాలున్నాయని పేర్కొంది. ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డి వేసిన పిటిషన్లో తన నేర చరిత్ర వివరాలను పేర్కొనకపోవడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరింది. పిటిషన్ దాఖలు చేసిన 10 రోజులకే బెయిల్ ఇవ్వడాన్ని తప్పుబట్టింది. ఇది రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
Comments