మోదీ-ట్రంప్, మోదీ-పుతిన్ భేటీకి డేట్స్ ఫిక్స్!
భారత ప్రధాని మోదీ, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఈ నెలాఖరులో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. అక్టోబర్ 26, 27 తేదీల్లో మలేషియాలో జరిగే ASEAN సమ్మిట్లో మోదీ పాల్గొననున్నారు. ట్రంప్నకూ ఆహ్వానం అందగా, ఆయన పాల్గొనడంపై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ ట్రంప్ హాజరైతే మోదీతో భేటీ జరిగే అవకాశముంది. మరోవైపు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ PM మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపేందుకు డిసెంబర్ 5, 6 తేదీల్లో భారత్లో పర్యటించనున్నారు.
Comments