మరోసారి కాలేజీల బంద్ తప్పదా?
తెలంగాణ : రాష్ట్రంలో ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలు మరోసారి బంద్ కానున్నట్లు తెలుస్తోంది. దసరాకు ఇస్తామన్న రూ.600 కోట్లను ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. దీనిపై ఇవాళ సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చించనుంది. ఇటీవల డిగ్రీ, PG, ఇంజినీరింగ్, ఫార్మసీ, MBA, MCA, B.Ed, నర్సింగ్ తదితర కాలేజీలను మూసేసి ప్రభుత్వంతో చర్చల అనంతరం విరమించుకున్న విషయం తెలిసిందే.
Comments