యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: మంత్రి పొన్నం
తెలంగాణ : యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మాదకద్రవ్యాల వ్యతిరేక రన్లో పాల్గొని మాట్లాడారు. ‘డ్రగ్స్ వినియోగం యువతకు అతిపెద్ద ముప్పు. ఇది విద్యను, విద్యార్థుల్లోని ప్రతిభను నాశనం చేస్తుంది. ప్రతి యువకుడు తాను మాత్రమే కాకుండా తన చుట్టూ ఉన్న వారిని కూడా డ్రగ్స్‌కు దూరంగా ఉంచేందుకు ప్రయత్నించాలి’ అని పిలుపునిచ్చారు.
Comments