రాజమండ్రి-తిరుపతి: కొత్త విమాన సర్వీసు
ఆంధ్ర ప్రదేశ్ : రాజమండ్రి-తిరుపతి మధ్య నూతన విమాన సర్వీసును కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, MP పురందేశ్వరి వర్చువల్‌గా ప్రారంభించారు. అలయన్స్ ఎయిర్ ఆధ్వర్యంలో వారానికి 3 రోజులు (మంగళ, గురు, శని) విమాన సర్వీసులు నడుస్తాయి. రేపటి నుంచి ఈ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఉ.7:40కి తిరుపతి నుంచి బయలుదేరి ఉ.9:25కి రాజమండ్రి చేరుకోనుంది. ఉ.9:50కి రాజమండ్రి నుంచి బయలుదేరి ఉ.11:20కి తిరుపతి చేరుకోనుంది.
Comments