రెండేళ్లలోపు పిల్లలకు దగ్గుమందు వాడొద్దు: కేంద్రం
రెండేళ్లలోపు చిన్నారులకు దగ్గుమందు వాడొద్దని కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది. ఇటీవల మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లో కాఫ్ సిరప్ వల్ల 11మంది పిల్లలు మరణించారు. మధ్యప్రదేశ్ లోని ఛింద్వారా జిల్లాలోనే 9మంది చనిపోయారు. వీరిలో ఐదుగురికి ‘Coldref’, ఒకరికి ‘Nextro’ సిరప్ తాగించినట్టు తేలింది. అయితే ఆయా సిరప్ల్లో కల్తీ లేదని తేలగా, వాటిల్లో వాడిన కెమికల్స్ వల్లే మరణాలు సంభవించొచ్చని కేంద్రం అనుమానిస్తోంది.
Comments