రుణాలు డిపాజిట్ల వృద్ధితో దూసుకెళ్తున్న బ్యాంకులు
న్యూఢిల్లీ: వర్తమాన ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో దేశీయ బ్యాంకింగ్ రంగం బలమై న వృద్ధిని ప్రదర్శిస్తోంది. ప్రైవేట్ రంగంలోని ఐడిబీఐ బ్యాంక్, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్, కోటక్ మహీం ద్రా బ్యాంక్ రుణాలు, డిపాజిట్లలో గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి. ఎల్‌ఐసీ నియంత్రణలో ఉన్న ఐడిబీఐ బ్యాంక్ రెండో త్రైమాసికం చివరి నాటికి, రుణాల పంపీణీలో 15 శాతం వృద్ధిని నమోదు చేసి, మొత్తం రూ. 2.3 లక్షల కోట్లు బట్వాడా చేసింది. గత ఏడాది ఇదే కాలంలో బ్యాంకు రుణాలు రూ. 2 లక్షల కోట్లుగా ఉన్నా యి. మొత్తం డిపాజిట్లు 9 శాతం పెరిగి రూ. 3.03 లక్షల కోట్లకు చేరగా, బ్యాంకు మొత్తం వ్యాపారం 12 శాతం వృద్ధితో రూ. 5.53 లక్షల కోట్లకు చేరింది. కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌం ట్ (కాసా)డిపాజిట్లు 4 శాతం పెరిగి రూ.1.39 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. మరోవైపు, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ 9 శాతం రుణ వృద్ధిని నమోదు చేసిం ది. బ్యాంక్ మొత్తం రుణాల విలువ రూ. 27.9 లక్షల కోట్లకు చేరుకుంది. డిపాజిట్లు 15.1 శాతం పెరిగి రూ.27.1 లక్షల కోట్లకు చేరాయి. కాసా డిపాజిట్ల సగటు రూ. 8.77 లక్షల కోట్లుంది. ఇది గత ఏడాది ఇదే కాలంలో పోలిస్తే 8.5 శాతం అధికం. రెండో త్రైమాసికంలో కోటక్ మహీం ద్రా బ్యాంకు రుణాలు 15.8 శాతం పెరిగి రూ. 4.62 లక్షల కోట్లకు చేరగా, డిపాజిట్లు 14.6 శాతం పెరిగి రూ.5.28 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.
Comments