రోబోటిక్ శస్త్ర చికిత్సతో విజయవంతంగా మోకాలు మార్పిడి
హైదరాబాద్ సిటీ: యాబై ఏళ్లు దాటిన వారిలో కూర్చునే జీవనశైలి, స్థూలకాయం, కదలికలు తగ్గిపోవడం వంటి కారణాల వల్ల మోకాలు, తుంటి వంటి ఆర్థరైటిస్ సమస్యలు పెరుగుతున్నాయని కేర్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. దీంతో ఆధునిక జాయింట్ మార్పిడి చికిత్సలపై తెలంగాణ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోందన్నారు. మాకో రోబోటిక్ సిస్టమ్‌తో 250 మోకాలు, తుంటి మార్పిడి శస్త్రచికిత్సలు పూర్తి చేసినట్లు హైటెక్ సిటీ కేర్ ఆస్పత్రి వైద్యులు గురువారం వెల్లడించారు.
తాజాగా కొల్లూరుకు చెందిన విన్జమూరి వీఎస్ఎస్ శర్మ(70), సిద్దిపేటకు చెందిన ఎంఆర్‌జీ రఘునాథం(65), బీహెచ్‌ఈఎల్‌కు చెందిన శ్రీలక్ష్మికి(57) రెండు మోకాళ్ల మార్పిడి చేసినట్లు ఆస్పత్రి క్లినికల్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ గొట్టెముక్కల అశోక్ రాజు, సీనియర్ ఆర్థోపెడిక్స్ శరత్ బాబు, డాక్టర్ వాసుదేవ జువ్వాడి తెలిపారు. మోకాలు, తుంటి మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం కావాలంటే సరైన సర్దుబాటు, సమతుల్యత చాలా కీలకమని, రోబోటిక్ సిస్టమ్ వల్ల ఇది సాధ్యమవుతుందని చెప్పారు.









Comments