రాబోయే 3 గంటల్లో అతి భారీ వర్షాలు
ఆంధ్ర ప్రదేశ్ : తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాబోయే మూడు గంటల్లో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని APSDMA ట్వీట్ చేసింది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి, అనకాపల్లికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. దక్షిణ కోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ప్రయాణాలు చేయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని ప్రజలకు సూచించింది.
Comments