• Sep 11, 2025
  • NPN Log

    అమరావతి : రాష్ట్ర, జిల్లా ప్రధాన రహదారుల అభివృద్ధికి రూ.500 కోట్లను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేర కు ఆర్‌అండ్‌బీ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు బుధవారం ఉత్తర్వులు (జీఓ-473) జారీ చేశారు. ఇవి రెగ్యులర్‌ బడ్జెట్‌కు అదనంగా ఇస్తోన్న నిధులు. ఇందులో రూ.200 కోట్లను రాష్ట్ర ప్రధాన రహదారులు(స్టేట్‌ హైవేలు), రూ.300 కోట్లను జిల్లా ప్రధాన రహదారు(ఎండీఆర్‌)ల విభాగానికి కేటాయించారు. ఈ నిధులతో ప్రతిపాదిత ప్రాజెక్టులను చేపట్టనున్నారు. ఈ మేరకు ఎండీఆర్‌ చీఫ్‌ ఇంజనీర్‌ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement