లక్ష్యసేన్ ముందంజ
జార్‌బ్రుకెన్ (జర్మనీ): కిడాంబి శ్రీకాంత్‌కు హైలో ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ ఈవెంట్‌లో చుక్కెదురైంది. ఆరంభ రౌండ్లో భారత్‌కే చెందిన కిరణ్ జార్జ్ 21-19, 21-11తో ప్రపంచ మాజీ నెంబర్‌వన్ శ్రీకాంత్‌ను చిత్తుచేసి ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. కాగా లక్ష్యసేన్ 21-16, 22-20తో ఐదో సీడ్ క్రిస్టో పొపోవ్ (ఫ్రాన్స్)కు షాకిచ్చి రెండోరౌండ్‌కు చేరాడు. ప్రీక్వార్టర్స్‌లో సహచర షట్లర్ శంకర్ ముత్తుసామితో లక్ష్య తలపడనున్నాడు. మహిళల సింగిల్స్‌లో రైజింగ్ స్టార్ శ్రియాంశి వలిశెట్టి ముందంజ వేసింది.









Comments