విద్యాసంస్థలు ఆవిష్కరణలకు వేదికగా నిలవాలి
అనంతపురం : విద్యాసంస్థలు బోధనతోపాటు ఆవిష్కరణలకు వేదికగా నిలవాలని జేఎన్టీయూ (ఏ) వీసీ సుదర్శనరావు పిలుపునిచ్చారు. అనంతపురం నగర పరిధిలోని వర్సిటీలో నిర్వహిస్తున్న రెండ్రోజుల జాతీయస్థాయి ఇన్నోవేటర్స్ కాంక్లేవ్-2026 సదస్సు ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా వీసీ సుదర్శనరావు మాట్లాడుతూ... ఇన్నోవేటర్స్ కాంక్లేవ్ ద్వారా వివిధ రంగాల్లో అనుభవం కలిగిన నాయకుల భాగస్వామ్యంతో విద్యార్థులకు పరిశ్రమల అవసరాలు, సాంకేతికతలో వస్తున్న మార్పులు, పరిశోధన అవకాశాలు, వ్యాపారాభివృద్ధి అంశాలపై అవగాహన పొందే అవకాశం లభించిందన్నారు.
కాంక్లేవ్‌లో భాగంగా రెండోరోజు దేశాభివృద్ధిలో ఆవిష్కరణల పాత్ర, స్టార్టప్, నిధుల సమీకరణ, సాంకేతికత-చట్టం-పరిపాలన వంటి అంశాలపై లీడర్షిప్ డైలాగ్స్ విద్యార్థులకు ఉపయోగకరంగా మారాయన్నారు. ఈ కార్యక్రమానికి ఎస్కేయూ వీసీ జ్యోతికుమార్, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఏ చౌదరి, యాక్సెంచర్ గ్లోబల్ మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ పింగళి, టాటా ఏఐజీ బోర్డు డైరెక్టర్ విజయదీప్తి, ఐఈఈఈ ఇండియా హెడ్, సీనియర్ డైరెక్టర్ డాక్టర్ శ్రీకాంత్ చంద్రశేఖరన్, ఈథర్వింగ్ ఏరోస్పేస్ సీఈవో మానేగార్ శర్మాస్ వలి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.










Comments