వాయుగుండం ముప్పు.. అతిభారీ వర్షాలు
ఆంధ్ర ప్రదేశ్ : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఇవాళ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, తూ.గో, కోనసీమ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయంది. ఏలూరు, ప.గో, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వెల్లడించింది.
Comments