• Apr 19, 2026
  • NPN Log

    డ్రై ఫ్రూట్స్‌లో చాలా పోషకాలు ఉంటాయి. కానీ కొన్ని వాటికి శరీరాన్ని వేడి చేసే గుణం ఉంటుంది. అందుకే వేసవిలో వాటిని సరైన విధంగా, సరైన సమయంలో తింటేనే మంచిది. వేసవిలో మన ఆహారంలో చాలా మార్పులు చేస్తుంటాం. ఈ సమయంలో వేడి చేసే ఆహారాలను తగ్గించాలని చెబుతారు. అందుకే చాలా మంది డ్రై ఫ్రూట్స్ తినడం కూడా తగ్గిస్తారు. కానీ నిజానికి సరైన విధంగా తింటే వేసవిలో కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి. ప్రతి డ్రై ఫ్రూట్‌కు వేర్వేరు పోషకాలు, ప్రయోజనాలు ఉంటాయి. కొన్ని శక్తిని ఇస్తే, మరికొన్ని శరీరాన్ని బలంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. వాటిని సరైన సమయంలో తింటే నీరసం, అలసట వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

    బాదం పప్పు

    బాదంలో ప్రోటీన్, విటమిన్ E వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి కొద్దిగా వేడి ఇస్తాయి. అందుకే వేసవిలో బాదం పప్పును రాత్రిపూట నీటిలో నానబెట్టి, ఉదయం తినడం చాలా ఆరోగ్యకరమైన అలవాటు.. ఉదయం తినడం వల్ల మెదడు శక్తి పెరుగుతుంది, జ్ఞాపకశక్తి కూడా మెరుగవుతుంది.

    ఎండుద్రాక్ష

    ఎండుద్రాక్షలో ఐరన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటిని కూడా రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం తినడం మంచిది. ఇలా తింటే జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది, రక్తహీనతకు కూడా సహాయపడుతుంది.

    అత్తి పండ్లు

    అత్తి పండ్లు కూడా వేడి చేసే స్వభావం కలిగి ఉంటాయి. వీటిని రాత్రి నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తింటే మలబద్ధకం తగ్గుతుంది.

    ఖర్జూరాలు ఎప్పుడు తినాలి?

    ఖర్జూరాల్లో శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇవి శరీరానికి బలం ఇస్తాయి. వాటిని ఉదయం 10–11 గంటల మధ్య లేదా వ్యాయామం ముందు తినడం మంచిది.

    జీడిపప్పు

    జీడిపప్పులో ప్రోటీన్, కొవ్వు, శక్తి ఎక్కువగా ఉంటుంది. వాటిని మధ్యాహ్న భోజనం తర్వాత లేదా సాయంత్రం తినడం మంచిది. ఇలా డ్రై ఫ్రూట్స్‌ను సరైన సమయంలో, సరైన పద్ధతిలో తింటే వేసవిలో కూడా ఇవి ఆరోగ్యకరంగా ఉంటాయి.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement