శక్తిమంతమైన కంటెంట్ పోస్ట్ చేయండి: సజ్జనార్
సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. కంటెంట్ హాస్యం కోసం కాకుండా శక్తిమంతంగా ఉండాలని Xలో పిలుపునిచ్చారు. సోషల్ మీడియాను మహిళా రక్షణ, డ్రగ్స్ వ్యతిరేక, సైబర్ క్రైమ్‌పై అవగాహన కల్పించే రీల్స్, పోస్టులకు వేదికగా మార్చాలని పేర్కొన్నారు. లైక్స్ కాదు, జీవితాలను(లైవ్స్) కాపాడటమే ముఖ్యమన్నారు. మీరు ఇవాళ చేసే వీడియో రేపు ఒక జీవితాన్ని నిలబెడుతుందని సూచించారు.
Comments