శ్రీ బాలా త్రిపురసుందరి దేవిగా అమ్మవారు
దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో సాంబమూర్తి దేవాలయ ప్రాంగణంలో అమ్మవారిని ప్రతిష్టించారు. విగ్రహ దాతగా సంపెల్లి రవీందర్రావు -లక్ష్మి దంపతులు సోమవారం అమ్మవారు భక్తులకు శ్రీ బాలా త్రిపురసుందరి దేవిగా అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవీ నవరాత్రి మండపంలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మొదటిరోజు మండపం వద్ద సంపెల్లి రవీందర్ రావు కుటుంబ సభ్యులతో ఆలయ అర్చకులు భైరవపట్ల వెంకటేశ్వర శర్మ పూజా కార్యక్రమం నిర్వహించారు అనంతరం భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాల స్వీకరించారు,కార్యక్రమంలో మహిళలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Comments