• Oct 05, 2025
  • NPN Log

    హైదరాబాద్‌ : స్థానిక ఎన్నికల సమరానికి కమలదళం సమాయత్తమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు, జుబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఆ పార్టీ నాయకత్వం ఆదివారం కీలక సమావేశం నిర్వహించనుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు అధ్యక్షతన జరగనున్న పదాధికారుల సమావేశానికి అందుబాటులో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. స్థానిక ఎన్నికల సన్నద్ధత, జూబ్లీహిల్‌ ఉప ఎన్నిక అభ్యర్థిత్వం, కార్యాచరణ ప్రణాళికపై చర్చించనున్నారు. అనంతరం ఈనెల 8న జరగనున్న మరో కీలక సమావేశానికి పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్‌ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఖరారుకు సంబంధించి త్రిసభ్య కమిటీలు వేసే అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. జడ్పీటీసీ అభ్యర్థులకు సంబంధించి జిల్లా పార్టీ ఇన్‌చార్జి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర పార్టీ పరిశీలకుడితో కమిటీ ఏర్పాటు చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ కమిటీ ఆధ్వర్యంలోనే అభ్యర్థులకు బీ ఫాంలు అందజేయనున్నారు. ఇక, మండల పార్టీ అధ్యక్షుడు, మండల ఇన్‌చార్జి, జిల్లా పరిశీలకుడితో ఏర్పాటు చేసే కమిటీ ఎంపీటీసీ అభ్యర్థులను ఖరారు చేయనుంది. మరోవైపు.. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. సరైన అభ్యర్థిని ఎంపిక చేసేందుకు మాజీ ఎమ్మెల్యే ఎం.ధర్మారావు, మాజీ ఎంపీ పోతుగంటి రాములు, సీనియర్‌ నాయకుడు కోమల ఆంజనేయులు సభ్యులుగా ఓ కమిటీని రాంచందర్‌రావు నియమించారు. అభ్యర్థి ఎంపికపై పార్టీ నాయకుల అభిప్రాయాలను ఈ కమిటీ సేకరించనుంది. కాగా, ఉప ఎన్నికలో తానే బీజేపీ అభ్యర్థినంటూ సోషల్‌ మీడియాలో ఓ నేత ప్రచారం చేసుకోవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ విషయం పార్టీ నాయకత్వం దృష్టికి వెళ్లగా.. సదరు నేతపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

    రైతులను మోసగిస్తున్న కాంగ్రెస్‌:

    స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ జిల్లా పరిషత్‌లను బీజేపీ కైవసం చేసుకోబోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర నిధులను సైతం దారి మళ్లించి పంచాయతీలను ఆర్థికంగా దెబ్బతీసిన పాపం బీఆర్‌ఎ్‌సదేనని విమర్శించారు. శనివారం ‘ఆంధ్రజ్యోతి’తో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆరోపించారు. తాజా మాజీ సర్పంచ్‌లు, మహిళలు, వృద్ధులు, రైతులు, యువతే బీజేపీ బ్రాండ్‌ అంబాసిడర్లు అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తెలిపారు. ఆయా వర్గాలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్‌ అమలు చేయలేదని విమర్శించారు. ఆ పార్టీ చేసిన మోసాలపై ప్రచారం చేస్తామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement