సారీ మమ్మీ బతకాలని లేదు: ఇట్లు నీ పింకీ
తెలంగాణ : పెదనాన్న వేధింపులు తాళలేక మేడ్చల్(D) కొంపల్లిలో అంజలి(17) ఆత్మహత్య చేసుకున్నారు. ‘అమ్మా నన్ను క్షమించు. బతకాలని లేదు. నాన్న చనిపోయాక పెదనాన్న ప్రతివారం గొడవకు వస్తున్నాడు. నాకు అవమానంగా ఉంది. మనల్ని ప్రశాంతంగా బతకనివ్వడు. ఫైనాన్స్ ఇప్పించి తానే నాన్నను చంపానని నాతో అన్నాడు. పెదనాన్నకు కచ్చితంగా శిక్ష పడాలి. సారీ మమ్మీ. ఇట్లు నీ పింకీ’ అని ఆమె సూసైడ్ నోట్ రాశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments