స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధరలు ఇవాళ కాస్త పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములపై రూ.600 పెరిగి రూ.1,00,750కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై రూ.500 ఎగబాకి రూ.92,300 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.1,000 పెరిగి రూ.1,26,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
Comments