హైదరాబాద్‌లో చాలెట్ లగ్జరీ హోటల్
హైదరాబాద్ : చాలెట్ హోటల్స్ లిమిటెడ్.. హైదరాబాద్‌లో 330 గదులతో లగ్జరీ హోటల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. మాదాపూర్‌లో 36,255 చదరపు అడుగుల విస్తీర్ణంలో వాణిజ్య, రిటైల్ స్పేస్‌తో దీన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపింది. సుమారు రూ.632.80 కోట్ల పెట్టుబడితో ఈ హోటల్‌ను నెలకొల్పుతున్నట్లు పేర్కొంది. ఈ నిధులను పూర్తిగా అంతర్గత వనరులు, రుణాల రూపంలో సమకూర్చుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. 2028-29 ఆర్థిక సంవత్సరంలో ఈ హోటల్ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. చాలెట్ హోటల్స్ ఇప్పటికే హైదరాబాద్‌లో ది వెస్టిన్ హైదరాబాద్ మైండ్‌స్పేస్, ది వెస్టిన్ హైదరాబాద్ హైటెక్ సిటీ పేరుతో రెండు హోటళ్లను నిర్వహిస్తోంది.










Comments