హైదరాబాద్లో హార్ట్ఫోర్డ్ టెక్నాలజీ సెంటర్
హైదరాబాద్ : అమెరికాకు చెందిన బీమా కంపెనీ హార్ట్ఫోర్డ్ హైదరాబాద్లో ఇండియా టెక్నాలజీ సెంటర్ను మంగళవారం ప్రారంభించింది. కృత్రిమ మేధ, డిజిటల్ ఇన్నోవేషన్ సామర్థ్యాలను వినియోగించుకుని భవిష్యత్ బీమా టెక్నాలజీని అభివృద్ధి చేయాలన్న కంపెనీ కట్టుబాటుకు ఈ కేంద్రం ఏర్పాటు నిదర్శనమని కంపెనీ తెలిపింది. అత్యాధునిక వర్క్ స్టేషన్లు, శిక్షణా వసతులు ఈ కేంద్రంలో ఉంటాయని వెల్లడించింది. 200 సంవత్సరాల హార్ట్ఫోర్డ్ చరిత్రను తెలియచేసే ఒక కుడ్యం ఈ కేంద్రంలో ప్రత్యేకత అని చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ శేఖర్ పన్నాల తెలిపారు. 1810లో ఏర్పాటైన హార్ట్ఫోర్డ్ ఫార్చూన్ 200 కంపెనీల్లో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా 19 వేల మంది కంపెనీలో పని చేస్తున్నారు.
Comments