133 మంది తాలిబన్ ఫైటర్లను చంపేశాం: పాక్
తమతో యుద్ధానికి దిగిన 133 మంది అఫ్గాన్ ఫైటర్లను చంపేసినట్లు పాకిస్తాన్ సమాచారశాఖ మంత్రి అతవుల్లా తరార్ తెలిపారు. 200 మందికి పైగా గాయాలైనట్లు వివరించారు. దీన్ని అఫ్ఘానిస్తాన్ ప్రభుత్వం ఖండించింది. తమ ఫైటర్లు 8 మందే చనిపోయారని, 11 మంది గాయపడినట్లు వెల్లడించింది. తాము 55 మంది పాకిస్తాన్ సైనికులను చంపేశామని, 2 మిలిటరీ బేస్‌లను, 19 ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకున్నామంది. అయితే తమ సైనికులు ఇద్దరే చనిపోయినట్లు పాక్ చెబుతోంది.










Comments