• Oct 21, 2025
  • NPN Log

    హైదరాబాద్ పాతబస్తీ బహదూర్‌పురా చౌరస్తా వద్ద గల ఓ స్క్రాప్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చిన్నగా మొదలైన మాటలు ఒక్కసారిగా గోదాం అంతటా వ్యాపించాయి. గమనించిన సిబ్బంది అక్కడినుంచి దూరంగా వెళ్లిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బహదూర్‌పురా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజిన్లతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో గోదాంలోని స్క్రాప్ సామగ్రితో పాటు ఒక జీపు, ఒక కారు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement